వైరల్ : చిరు పై శివ రాజ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

వైరల్ : చిరు పై శివ రాజ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Oct 1, 2023 8:00 AM IST

కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ రీసెంట్ గా తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం “జైలర్” కనిపించి తన సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాకే బిగ్గెస్ట్ హైలైట్స్ లో ఒకరిగా నిలిచిన సంగతి తెలిసందే. మరి ఈ చిత్రం తర్వాత శివ రాజ్ కుమార్ హీరోగా నటిస్తున్న “ఘోస్ట్” సినిమాతో అయితే పాన్ ఇండియా వైడ్ గా ఈ దసరా కానుకగా రాబోతున్నారు.

మరి ఈ మధ్యలో సోషల్ మీడియాలో జరిపిన ఇంటరాక్షన్ లో అయితే మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. “ఒక లెజెండ్ ఎప్పటికీ లెజెండ్ గానే ఉంటారు. నేను కలిసి మాట్లాడి ఎంతో నేర్చుకున్న ఎంతో గొప్ప వ్యక్తులలో ఆయన కూడా ఒకరు. ఆయన పట్ల నా ప్రేమ గౌరవం ఎప్పటికీ అలానే ఉంటుంది” అని శివ రాజ్ కుమార్ అయితే చిరుపై కామెంట్స్ చేశారు. దీనితో ఈ రిప్లై మెగా ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు