కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ తెలుగు నిర్మాత సుధీర్ చంద్ర పదిరితో కొత్త చిత్రానికి సంతకం చేశారు. ఈ రోజు నటుడి పుట్టినరోజును పురస్కరించుకుని అధికారికంగా ప్రకటించారు. కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. సుధీర్ చంద్ర ఫిల్మ్ కంపెనీ (SCFC) యొక్క ఈ తొలి కన్నడ ప్రొడక్షన్‌కి గతంలో విక్రమ్ ప్రభుతో పాయుమ్ ఒలి నీ యెనక్కు అనే తమిళ చిత్రాన్ని రూపొందించిన కార్తీక్ అద్వైత్ దర్శకత్వం వహించనున్నారు. తాత్కాలికంగా శివన్నఎస్‌సిఎఫ్‌సి01 అని పేరు పెట్టారు, ఇది భారీ బడ్జెట్ చిత్రం.
విక్రమ్ వేద మరియు కైతి (తెలుగులో ఖైదీ) చిత్రాలకు సంగీతం అందించిన సామ్ సిఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. శివ రాజ్‌కుమార్ కాన్సెప్ట్ పోస్టర్, విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందనే సూచనను అందిస్తోంది. శివ రాజ్‌కుమార్ పోస్టర్‌లో సీరియస్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.