తెలుగు ప్రేక్షకులు కోరుకునే కామెడీ, యాక్షన్, లవ్ స్టొరీ.. ఇలా అన్నీ సమంగా ఉండే కథలనే ఎంచుకుంటూ బాక్స్ ఆఫీసు వద్ద పలు హిట్స్ అందుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ మరోసారి అదే తరహాలో చేసిన సినిమా ‘శివమ్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నా ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాజిటివ్ టాక్ తో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాకి బిజినెస్ కూడా బాగా జరుగిందని ఇదివరకే తెలియజేశాం.
వైజాగ్ లో 2.25 కోట్లకి అమ్ముడు పోయిన శివమ్ రైట్స్ పశ్చిమ గోదావరిలో కూడా 1.25 కోట్లకి అమ్ముడు పోయాయీని తెలిపాం. తాజాగా వెస్ట్ గోదావరి తో పటు ఈస్ట్ గోదావరిలో కూడా 1.45 కోట్లకి శివమ్ రైట్స్ తీసుకున్నారు. దీని ప్రకారం రామ్ కి ఆంధ్ర రీజియన్ లో మచ్న్హి ఫాలోయింగ్ ఉండడమే కాకుండా తన సినిమాలు అక్కడ మంచి ప్రాఫిట్స్ ని వసూలు చేస్తున్నాయని అర్థమైంది. గత సినిమాల మాదిరిగానే శివమ్ సినిమా కూడా మంచి వసూళ్ళు చేస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ ఈ రేంజ్ పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. రామ్ సరసన రాశి ఖాన్న జోడీ కట్టిన ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.


