సెన్సార్ కంప్లీట్ చేసుకున్న శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’

Published on Oct 6, 2023 2:00 AM IST

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా ఎం జి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఘోస్ట్. ఈ మూవీని సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందేశ్ నాగరాజ్ గ్రాండ్ గా నిర్మిస్తుండగా అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణన్, అర్చన జోయిస్, సత్య ప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఘోస్ట్ టైటిల్ సాంగ్, టీజర్, ట్రైలర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో పాటు అవి మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. కాగా ఈ పాన్ ఇండియన్ మూవీ అక్టోబర్ 19న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఘోస్ట్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు / ఏ సర్టిఫికెట్ ని అందుకుంది. కాగా తమ మూవీ శివరాజ్ కుమార్ గారి ఫ్యాన్స్ తో పాటు అన్ని భాషల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు