అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు చందూ మొండేటి తెరాకెక్కిస్తున్న ఈ మూవీ పూర్తి రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రానుంది. ఇప్పటికే రిలీజైన ‘బుజ్జి తల్లి’ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్ గా శివశక్తి పాట అయిన ‘నమో నమః శివాయ’ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
డిసెంబర్ 22న ఈ పాటను కాశీ నగరంలో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఇప్పుడు ఈ పాట రిలీజ్ వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సాంగ్ ని రిలీజ్ చేయలేకపోతున్నామని.. త్వరలోనే ఈ పాటను మరో తేదీన రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 7న ‘తండేల్’ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.