“కార్టూన్ నెట్వర్క్” అధ్యాయం ముగిసిందా?

“కార్టూన్ నెట్వర్క్” అధ్యాయం ముగిసిందా?

Published on Jul 9, 2024 3:12 PM IST

వరల్డ్ వైడ్ గా పాపులర్ అయినటువంటి పలు ప్రముఖ ఛానెల్స్ లో చిన్న పిల్లలని కూడా అలరించే ఛానెల్స్ కూడా అనేకం ఉన్నాయి. మరి వీటిలో అయితే ఐకానిక్ కార్టూన్ ఛానెల్ “కార్టూన్ నెట్వర్క్” కోసం తెలియని వారు ప్రస్తుత జెనరేషన్ లో ఎవరూ ఉండరు. మరి ఎన్నో ఐకానిక్ షోస్ ని కూడా ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. టామ్ అండ్ జెర్రీ, పోపాయ్, పవర్ ఫఫ్ గర్ల్స్, కరేజ్ ది కోవర్డ్లీ డాగ్, బెన్ 10, ఇంకా ఎన్నెన్నో వింటేజ్ షోస్ 90స్ కిడ్స్ ని అలరించాయి.

అయితే ఇప్పటికీ కూడా ఈ ఛానల్ ప్రసారం అవుతుండగా సడెన్ గా ఇప్పుడు ఈ ఛానెల్ మూత పడింది అనే వార్త ఒకటి ట్విట్టర్ లో వైరల్ గా మారింది. రిప్ కార్టూన్ నెట్వర్క్ అంటూ ఓ ట్యాగ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. దీనితో చాలా మంది కార్టూన్ నెట్వర్క్ అధ్యాయం ముగిసింది అనే అనుకుంటూ సోషల్ మీడియాలో చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు కార్టూన్ నెట్వర్క్ ఎక్కడా క్లోజ్ అవ్వలేదట.

కానీ ఎందుకు ఇదంతా ట్రెండ్ అవుతుంది అంటే యానిమేషన్ రంగానికి సంబంధించి అందులో ఉండే వర్కర్స్ తమ ఉపాధిని ఉద్యోగాలని కోల్పోవడంతో ఈ ట్యాగ్ ని ట్రెండ్ చేసి వారి సమస్యని చాటి చెప్పాలని ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. గత కరోనా సమయం తర్వాత నుంచి పెద్ద ఎత్తున యానిమేషన్ రంగంలో మంది ఉద్యోగాలు కోల్పోయారట.

అయితే అప్పట్లో రిమోట్ గా కొన్ని పనులు జరిగి ఎంటర్టైన్మెంట్ ని అందించారు కానీ నెమ్మదిగా ప్రొడ్యూసర్స్ ఎక్కువ లాభాలు తక్కువ ఖర్చుతో అందుకోవాలని చాలా మందిని తీసేస్తున్నారు అని అందుకే ఈ ప్రయత్నం చేసి యానిమేషన్ రంగాన్ని నమ్ముకున్న వారు పడుతున్న బాధ చెప్పడానికే ఈ ట్రెండ్ వాడుకున్నారు తప్పితే ఆ ఛానెల్ ఆగిపోయింది అనే మాటలో వాస్తవం లేదట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు