రీసెంట్ గా టాలీవుడ్ నుంచి వచ్చి భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన సినిమా “దేవర” కూడా ఒకటి. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా తోనే హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటుగా విలన్ గా నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమాతో పరిచయం అయ్యారు. అయితే లేటెస్ట్ గా సైఫ్ పై ఓ షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది.
తను నిజంగా రెండు కత్తి పోట్లకి గురయ్యారు అనే షాకింగ్ న్యూస్ ఇపుడు సినీ వర్గాలను షేక్ చేస్తుంది. అయితే ఈ గురువారం ఉదయం 2 గంటల 30 నిమిషాల సమయంలో తను ముంబై లోనే తన ఇంట్లో ఉండగానే ఈ దాడికి లోనయినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఎవరో తన ఇంట్లోకి దొంగతనం చేసేందుకు చొరబడగా సైఫ్ అడ్డుకునే యత్నంలో అతడు తనపై హత్యాయత్నం చేసినట్టు బాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి.
దీనితో తనని మూడున్నర సమయంలో అలా కుటుంబీకులు లీలావత్ హాస్పిటల్ కి తరలించారట. ప్రస్తుతం ఈ కేసు విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారట. అయితే ప్రస్తుతం సైఫ్ ప్రాణాలకు హాని లేదని తెలుస్తోంది. మరి ఈ ఉదయం ఈ ఊహించని వార్త బాలీవుడ్ వర్గాల్లో షాకింగ్ గా మారింది అని చెప్పాలి. సైఫ్ త్వరగా కోలుకుని మళ్లీ సినిమాలు స్టార్ట్ చేయాలని ఆకాంక్షిద్దాం.