షాకింగ్.. ‘ఓపెన్ హైమర్’కి ఇప్పుడెలా ఇండియన్ సెన్సార్ ఒప్పుకుంది?

ప్రపంచ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ అంటే తెలియని సినిమా అభిమాని ఉండడు. తన మైండ్ బెండింగ్ సినిమాలకి ఫ్యాన్స్ అనేకం. అయితే తన నుంచి చివరిగా వచ్చిన సూపర్ హిట్ చిత్రమే “ఓపెన్ హైమర్”. నిజ జీవిత శాస్త్రవేత్త అణుబాంబు కనుగొన్న ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో లీడ్ రోల్ ని కిలియన్ మర్ఫీ పోషించారు.

అయితే వీరి కాంబినేషన్ కి ఆస్కార్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా వెస్ట్రన్ దేశాల్లో ఎలాంటి సెన్సార్ లేకుండా విడుదల అయ్యింది. కానీ మన దేశంలో మాత్రం పలు సీన్స్ ని సెన్సార్ కవర్ చేసి థియేటర్స్ లో విడుదల చేసింది. అలాగే ఓటీటీకి వచ్చాక కూడా సెన్సార్ తోనే వచ్చింది కానీ ఇపుడు షాకింగ్ గా నెట్ ఫ్లిక్స్ లో అన్ సెన్సార్ వెర్షన్ లో ఓపెన్ హైమర్ స్ట్రీమింగ్ అవుతుంది.

అక్కడ యూఎస్ వెర్షన్ లో ఉన్న 18 ప్లస్ సన్నివేశాలు అన్నీ ఇండియన్ ఓటీటీ వెర్షన్ లో కూడా ఉన్నాయి. దీనితో అప్పుడు అభ్యంతరం చెప్పిన ఇండియన్ సెన్సార్ ఇప్పుడెలా వీటికి అంగీకరించారు అనేది షాకింగ్ గా మారింది. ముందు జియో సినిమాలో స్ట్రీమింగ్ కి వచ్చినప్పుడు కూడా సెన్సార్ తోనే వచ్చింది. కానీ ఇపుడు నెట్ ఫ్లిక్స్ కి వదిలేసారు. మరి ఇందుకు కారణం ఏంటి అనేది రివీల్ కావాల్సి ఉంది.

Exit mobile version