షాకింగ్ : అల్లు అర్జున్ ఇంటిపై దాడులు..

షాకింగ్ : అల్లు అర్జున్ ఇంటిపై దాడులు..

Published on Dec 22, 2024 5:32 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ పక్క పుష్ప 2 తో ఇండియా షేక్ అయ్యే బిగ్గెస్ట్ హిట్ కొట్టినప్పటికీ ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో జరిగిన షాకింగ్ ఘటన ఇది చిలికి చిలికి గాలి వాన అయ్యి ఎటెటో వెళుతుంది. అయితే అల్లు అర్జున్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టగా తాను ఎక్కడా కఠినంగా స్పందించింది లేదు. కానీ నేడు షాకింగ్ గా అల్లు అర్జున్ ఇంట దుమారం రేగింది.

తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన జెఏసి(జాయింట్ యాక్షన్ కమిటీ) కి చెందిన వ్యక్తులు అల్లు అర్జున్ ఇంటి దగ్గరకి వచ్చి దాడులు చేసిన ఘటన ఇపుడు షాకింగ్ గా మారింది. సంధ్య థియేటర్ ఉదంతంలో రేవతి అల్లు అర్జున్ వల్లే చనిపోయింది అంటూ తన ఇంటి దగ్గర హంగామా చేస్తూ తన ఇంటి దగ్గర ఉన్న కుండీలు పగులగొట్టారు. అలాగే బలవంతంగా ఇంట్లోకి చొరబడే ప్రయత్నాలు కూడా చేశారు. దీనితో ఈ షాకింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి సడెన్ గా ఇప్పుడే వీరు ఇలా చేయడం పలు ప్రశ్నలకి దారి తీస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు