ఎన్టీఆర్30 కోసం త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యూనరేషన్?

Published on Aug 5, 2020 4:58 pm IST

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా ఉన్న త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో మూవీతో మరో మెట్టు పైకి వెళ్లారు. ఆయన మొదటిసారి అల వైకుంఠపురంలో మూవీతో 200 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరారు. అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ మూవీ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టడం జరిగింది. కాగా త్రివిక్రమ్ తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశారని తెలుస్తుంది. త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రకటించారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలు కావాల్సిఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది.

కాగా ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ భారీగా తీసుకుంటున్నారని టాక్. ఏకంగా 20 కోట్లకు తన పారితోషికం పెంచేశాడనే మాట వినిపిస్తుంది. ఒకప్పుడు 10-15 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న త్రివిక్రమ్ 20 కోట్లకు పెంచేశాడంటే మాములు విషయం కాదు. ఇక ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

More