షాకింగ్ : టాలీవుడ్ ప్రముఖ సీనియర్ స్టార్ ఎడిటర్ కన్నుమూత.!

Published on Jul 6, 2022 8:03 am IST


ఏ సినిమా అయినా కూడా ఆడియెన్స్ ఆధ్యంతం మెప్పించాలి అంటే దర్శకుని స్క్రీన్ ప్లే తో పాటుగా ఎడిటింగ్ వర్క్ కూడా ఎంతో పర్ఫెక్ట్ గా మరియు షార్ప్ గా ఉండాలి. ఎడిటింగ్ కూడా బాగున్నట్టు అయితే సినిమా అవుట్ పుట్ ఎక్కడా బోర్ లేకుండా చాలా బాగా వస్తుంది.

మరి ఇప్పుడు మన తెలుగు సినిమా దగ్గర చాలా మంది ఎడిటర్స్ ఉన్నారు కానీ ఎప్పుడు నుంచో ఎన్నో సినిమాలు చేసి ఇప్పటికీ కూడా పలు భారీ సినిమాలకు ఎడిటింగ్ వర్క్ అందించిన సీనియర్ మోస్ట్ స్టార్ ఎడిటర్ గౌతమ్ రాజు కన్ను మూయడం టాలీవుడ్ తీవ్ర విషాదం నెలకొల్పింది.

అయితే తాను గత కొంత కాలం నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో పోరాడుతుండగా ఈరోజు తెల్లవారు జామున ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసినట్టుగా నిర్ధారణ అయ్యింది. అయితే రాజోలు లో జన్మించిన తాను వసంత గీతం మొదలు కొని ఎన్నో భారీ సినిమాలు..

ఆల్ మోస్ట్ ప్రస్తుత స్టార్ హీరోలు పవన్, మహేష్ ల గబ్బర్ సింగ్, సరిలేరు నీకెవ్వరు, ఆగడు, తదితర ఎన్నో వందల చిత్రాలకు ఎడిటర్ గా వర్క్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఖచ్చితంగా తెలుగు సినిమాలో ఉంటుంది. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :