ఈ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రానికి షాకింగ్ టీఆర్పీ


యూనివర్సల్ హీరో కమల్ హాసన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విక్రమ్ తో మళ్ళీ సూపర్ ఫామ్ లోకి వచ్చారు. చాలా కాలం తర్వాత నటుడికి చాలా అవసరమైన హిట్‌ని ఈ సినిమా అందించింది. లోకేష్ కనగరాజ్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి దర్శకత్వం వహించాడు మరియు ఇది విడుదలైన సమయంలో తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

తాజా వార్త ఏమిటంటే, తమిళ వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ 4.42 టీఆర్పీ ని నమోదు చేసింది. ఈ చిత్రం తమిళ పరిశ్రమలో భారీ వసూళ్లను రాబట్టి, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఓటిటి లో ఎక్కువ మంది వీక్షించడం, అతి తక్కువ టీఆర్పీ కి ఒక కారణం అని చెప్పాలి. విక్రమ్‌లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో నటించారు. అతి త్వరలో, ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ రోల్ ప్రారంభం కానుంది.

Exit mobile version