బిగ్ బాస్ 6 లాంచ్ ఎపిసోడ్‌కి షాకింగ్ టీఆర్పీ!

బిగ్ బాస్ 6 లాంచ్ ఎపిసోడ్‌కి షాకింగ్ టీఆర్పీ!

Published on Sep 15, 2022 11:12 PM IST

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తన సరికొత్త ఆరవ సీజన్‌తో ప్రేక్షకులను అలరించడానికి తిరిగి వచ్చింది. ఈ సీజన్‌లో కూడా కింగ్ నాగార్జున హోస్ట్ మరియు లాంచ్ ఎపిసోడ్ సెప్టెంబర్ 4న ప్రసారం చేయబడింది. దానిలో 21 మంది పోటీదారులు పరిచయం అయ్యారు. ఆరవ సీజన్ పరిచయ ఎపిసోడ్ అన్ని లాంచ్ ఎపిసోడ్‌లలో అతి తక్కువ టీఆర్పీ ను నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

నివేదికల ప్రకారం, టీఆర్పీ 8.86 గా ఉంది. ఇది చాలా షాకింగ్ టీఆర్పీ రేటింగ్ అని చెప్పాలి. నామినేషన్లు, ఎలిమినేషన్లతో హీటెక్కుతున్న ఈ షో రానున్న రోజుల్లో బాగా ఆడుతుందని భావిస్తున్నారు ప్రేక్షకులు. అలాగే ఆడియెన్స్ కోసం షో రన్నర్లు సరికొత్త సర్ ప్రైజ్ లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు