భారతీయ సినిమా చరిత్రలోనే ఒక దిగ్గజంగా నిలిచిన చిత్రం ‘షోలే’ . ఈ చిత్రానికి ఇప్పుడు 3డి రూపం ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన వర్క్, మాయ డిజిటల్ స్టూడియో లో మొదలైంది. తద్వారా ఈ సినిమాను పూర్తిస్తాయీ 3డి ఫార్మాట్ లోకి మారుస్తారు.
ఫ్రాంక్ ఫోస్టర్ ఆధ్వర్యంలో ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిపై ఆయన ఏమంటున్నారంటే.. “ఇది మాకు ఛాలెంజింగ్ టాస్క్, ఈ సినిమా 35 ఏళ్ల క్రిందట తీయటం జరిగింది. ఒరిజినల్ ఫిల్మ్ డిజిటల్ కాదు. దీంతోపాటు ఈ సినిమా నిడివి 3 గంటలకు పైనే ఉంది. ప్రతీ ఫ్రేం చాలా జాగ్రత్తగా, సహనంతో చేయాల్సిఉంది”.
వచ్చే ఏడాది ఏదో సమయంలో ఈ సినిమా భారీ ఎత్తున విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ఇండియన్ సినిమా లవర్స్ కు ఖచ్చితంగా గొప్ప వార్తే. ఈ అద్భుత కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని ఆశిద్దాం.