శరవేగంగా తమన్నా “ఓదెల2” మూవీ షూటింగ్!

శరవేగంగా తమన్నా “ఓదెల2” మూవీ షూటింగ్!

Published on Jun 28, 2024 10:00 PM IST

2021లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్‌ చిత్రం ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ఓదెల 2 పై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్ మరియు సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్టైలిష్ మాస్ డైరెక్టర్ సంపత్ నంది రూపొందించిన ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ మరియు మేకింగ్ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలకమైన యాక్షన్‌ షెడ్యూల్‌ జరుగుతోంది. సినిమాలోని కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేయడంపై చిత్ర యూనిట్ దృష్టి సారించింది. ఈ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉంటాయని మేకర్స్ భావిస్తున్నారు. తమన్నా భాటియా ఈ యాక్షన్ పార్ట్ కోసం పరిపూర్ణతను సాధించడానికి కఠినమైన శిక్షణ మరియు రిహార్సల్స్‌లో ఉంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, ఏస్ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ సినిమాటోగ్రాఫర్, రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు