అల్లరి నరేష్ – శ్రియా జంటగా నటిస్తోన్న ఓ చిత్ర షూటింగ్ కు ఇవాళ ఆటంకం కలిగింది. ఆందోళనకారులు హీరో, హీరోయిన్ లపై దాడికి తెగబడ్డారు. తెలంగాణాకు అనుకూలంగా నినాదాలు చేయమంటూ ఒత్తిడి తెచ్చారు. ఈ ఘటన ఆప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. శ్రియా కూర్చున్న కారుపై అల్లరిమూకలు రాళ్ళతో దాడి చేసాయి. అయితే ఆమె గాయాలు కాకుండా తప్పించుకున్నారు. దీనిపై ఆమె ట్విట్టర్ లో తన ఆందోళన, కోపాన్ని వ్యక్తం చేసారు.
ఈ సంఘటన రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద జరిగింది. ఆ సమయంలో కొందరు స్టూడెంట్స్ సెట్స్ లోకి ప్రవేశించి షూటింగ్ కు అంతరాయం కలిగించారు.