శృతి హాసన్ లక్ పవన్ సినిమాకు పనిచేస్తుందట

Published on Jan 13, 2021 3:00 am IST

‘క్రాక్’ సినిమాతో రవితేజ హిట్ ట్రాక్ ఎక్కారు. అయితే ఈ హిట్ వెనుక ఒక సెంటిమెంట్ ఉందని అంటున్నారు ప్రేక్షకులు. అదే శృతి హాసన్. శృతి హాసన్ కథానాయకిగా నటించడం సినిమాకు కలిసొచ్చింది అంటున్నారు కొందరు అభిమానులు. గతంలో వరుసగా పరాజయాలతో ఇబ్బందిపడుతున్న పవన్, మహేష్ బాబులకు శృతి హాసన్ కథానాయకిగా చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయని, అదే సెంటిమెంట్ రవితేజ విషయంలోనూ రిపీట్ అయిందని అంటున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత ‘క్రాక్’ రవితేజను నిలబెట్టింది.

ఇప్పుడు ఇదే సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ విషయంలోనూ పునరావృత్తం అవుతుందని అంటున్నారు. గతంలో పవన్ మూడు డిజాస్టర్ల తర్వాత చేసిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ కు సాలిడ్ విజయం లేదు. వరుసగా పరాజయాలే. ఆయన చేస్తున్న కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’లో శృతి హీరోయిన్. సెంటిమెంట్ మేరకు ‘గబ్బర్ సింగ్’ తరహాలో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలని, అందుకుంటుందని అంటున్నారు. మధ్యలో ‘కాటమరాయుడు’ సినిమాకు ఈ సెంటిమెంట్ బెడిసికొట్టినా ఈసారి మాత్రం పనిచేస్తుందని చెబుతున్నారు శృతి ఫ్యాన్స్.

సంబంధిత సమాచారం :

More