హీరోయిన్ శ్రుతిహాసన్ మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె హీరోయిన్ గానే కాకుండా.. సింగర్‌గా మ్యూజిక్ అల్బమ్‌లు విడుదల చేస్తూ ఆకట్టుకుంటుంది. ఐతే, తాజాగా శ్రుతిహాసన్, కమల్ హాసన్ బయోపిక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నా దృష్టిలో మా నాన్న సూపర్ హీరో. ఎప్పుడూ కూల్‌గా ఉంటారు. దర్శకులు కథలు చెబుతుంటే.. తరగతి గదిలో పిల్లాడిలా వింటారు. దర్శకత్వం అనేది ఎన్నో బాధ్యతలతో కూడిన పని. ఎందరికో స్ఫూర్తినిస్తుంది’ అని శ్రుతిహాసన్ చెప్పుకొచ్చింది.
శ్రుతిహాసన్ ఇంకా మాట్లాడుతూ.. ‘అందుకే, నాన్న బయోపిక్ కు నేను దర్శకత్వం వహించలేను. ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీయడానికి నేను సరైన వ్యక్తిని కాదు. నేను తీస్తే అది నావైపు నుంచి తీసినట్లు పక్షపాతంగా ఉంటుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప దర్శకులు ఉన్నారు. వాళ్లైతే అద్భుతంగా తెరకెక్కించగలరు’ అంటూ శ్రుతిహాసన్ తెలిపింది.