టైటిల్ సాంగ్ షూట్ లో ‘శ్యామ్ సింఘ రాయ్’ !

టైటిల్ సాంగ్ షూట్ లో ‘శ్యామ్ సింఘ రాయ్’ !

Published on Nov 21, 2020 8:07 PM IST


నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింఘ రాయ్’ సినిమా టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ లోని అల్యుమినియమ్ ఫ్యాక్టరీలో వేసిన
పాతతరం కలకత్తా నేపథ్యం సెట్ లో షూట్ చేస్తున్నారట. ఈ టైటిల్ సాంగ్ షూట్ మరో నాలుగు రోజులు పడుతుందని సమాచారం. ఈ సాంగ్ మొత్తం నాని పైనే సోలోగా తీస్తున్నారట. ఈ సినిమా సాంగ్ షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ కూడా ఇక్కడే మొదలు అవుతుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా కథ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. కథ ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా సినిమా వుంటుందట. ఈ సినిమా పై సినిమా జనాల్లో కూడా బాగా ఆసక్తి ఉంది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం క్రేజీ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో వినూత్నంగా ఉండబోతుందట. నాని మొదటి నుండి ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథలు చెప్పడానికి.. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు