మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి కోసం ఆయన అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఇప్పటికే ప్రభాస్ వివాహంపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఐతే, ప్రభాస్ పెళ్లి పై తాజాగా ‘ప్రభాస్ పెద్దమ్మ’ శ్యామలా దేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శ్యామలా దేవి మాట్లాడుతూ.. ‘కల్కి సక్సెస్‌ని ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడుతూ.. మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో రుజువైంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కు విజయం దక్కదని కొందరు కామెంట్స్ చేశారు.
కానీ, వారి అంచనాలు తారుమారు అయ్యాయి. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ అంతే. కోట్లాది అభిమానులు ఆశించినట్టుగా తన సినిమాలు ఉండేందుకు ప్రభాస్ ఎంతగానో కష్ట పడుతున్నాడు. ఇక ప్రభాస్ కి పెళ్లి చేయాలని మాకూ ఉంటుంది. కానీ, సమయం రావాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాం. అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారు. ఇప్పటి వరకూ ఆయన ఆశించినవన్నీ జరిగాయి. మ్యారేజ్ కూడా జరుగుతుంది’ అంటూ శ్యామలా దేవి చెప్పుకొచ్చింది.