ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’కి సంబంధించి జరిగిన పాట్నా ఈవెంట్‌లో జనం ఎక్కువగా వచ్చారనే విషయంపై నటుడు సిద్ధార్థ్ ఇటీవల కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు. బీరు, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారంటూ పరోక్షంగా సదరు ఈవెంట్‌పై సిద్ధార్థ్ కామెంట్స్ చేశాడు.
దీంతో సోషల్ మీడియాలో అతడిని బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై ఆయన మరోసారి స్పందించారు. సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ యు’ డిసెంబర్ 13న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కొందరు జర్నలిస్టులు ఆయనకు పుష్ప-2 ఈవెంట్‌పై చేసిన కామెంట్స్ గురించి ప్రశ్నలు సంధించారు. అల్లు అర్జున్ పై మీరు చేసిన కామెంట్స్ గురించి వివరించండి అని మీడియా అడిగింది. దీంతో తనకు అల్లు అర్జున్‌పై ఎలాంటి ద్వేషం లేదని.. పుష్ప-2 ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యినందుకు తాను కూడా సంతోషిస్తున్నానని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.
ఈ స్టేట్మెంట్‌తో పుష్ప-2పై తాను చేసిన కామెంట్స్ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని సిద్ధార్థ్ భావిస్తున్నాడు. ఇక ‘మిస్ యు’ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోండగా ఈ చిత్రాన్ని ఎన్.రాజశేఖర్ డైరెక్ట్ చేస్తున్నాడు.