ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టి్స్తుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఎలాంటి ప్రమోషన్స్ చేసిందో మనం చూశాం. ‘పుష్ప-2’ ప్రమోషన్స్‌ని పాట్నా నగరంలో నిర్వహించిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌తో చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఇక ఈ ఈవెంట్‌కి పాట్నాలో ఎంతమంది అభిమానులు వచ్చారో అందరికీ తెలిసిందే.
అయితే, ఇప్పుడు ఈ ఈవెంట్‌పై నటుడు సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తాజాగా కొత్త వివాదానికి తెరలేపాయి. సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ యు’ డిసెంబర్ 13న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్‌ను ‘పుష్ప-2’ పాట్నా ఈవెంట్‌కు హాజరైన ఆడియెన్స్ గురించి ప్రశ్నించగా.. బీరు బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు.. ఇండియాలో ఇదంతా కామన్.. అని అన్నాడు.
దీంతో బన్నీ ఫ్యాన్స్ సిద్ధార్థ్‌పై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఆయన్ను ట్రోల్ చేస్తూ ఆయన చేసిన సినిమాలు, వాటి ఫలితాల పై ట్రోలింగ్ వీడియోలు చేస్తున్నారు.