కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సిద్ధార్థ్ ‘మిస్ యు’

హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ యు’ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. తమిళనాడులో వర్షాల కారణంగా ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేశారు. ఈ సినిమాను దర్శకుడు ఎన్.రాజశేఖర్ డైరెక్ట్ చేస్తుండగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ సినిమాను డిసెంబర్ 13న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే కథ దీనిలో ఉందని వారు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఈ సినిమాతో సిద్ధార్థ్ మరోసారి సక్సెస్‌ను అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ సినిమాలో అందాల భామ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Exit mobile version