రేపు ప్రారంభం కానున్న సిద్ధార్థ్-నందిని రెడ్డిల సినిమా

రేపు ప్రారంభం కానున్న సిద్ధార్థ్-నందిని రెడ్డిల సినిమా

Published on Feb 1, 2012 2:51 PM IST

 

సిద్ధార్థ్ హీరోగా నందిని రెడ్డి డైరెక్షన్లో రాబోతున్న సినిమా పూజా కార్యక్రమాలు రేపు జరగనున్నాయి. ఈ పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టుడియోలో జరగనున్నాయి. సమంత హీరొయిన్ గా నటిస్తుండగా బెల్లంకొండ సురేష్ నిర్మాత. నందిని రెడ్డి గతంలో ‘అలా మొదలైంది’ చిత్రం తీసి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మనసును కూడా గెలుచుకుంది. ఈ పూజా కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్, వివి వినాయక్ ముఖ్య అతిదులుగా రానున్నారు. యూత్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు