‘జాక్ – కొంచెం క్రాక్’.. నేపాల్ షెడ్యూల్ పూర్తి!

‘జాక్ – కొంచెం క్రాక్’.. నేపాల్ షెడ్యూల్ పూర్తి!

Published on Oct 5, 2024 10:00 PM IST

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నెపాల్‌లో జరుగుతోంది. అయితే, ఈ నేపాల్ షెడ్యూల్‌కి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమా నేపాల్ షెడ్యూల్ పూర్తయ్యిందని ఓ వీడియో రూపంలో పేర్కొన్నారు. అంతేగాక, ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని కూడా వారు అనౌన్స్ చేశారు. ‘‘జాక్ – కొంచెం క్రాక్’’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఈ సినిమాకు పెట్టడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అవుతోంది. ఇక నేపాల్ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.

ఈ నేపాల్ షెడ్యూల్‌లో హీరోయిన్ వైష్ణవి చైతన్యతో పాటు సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా పాల్గొన్నాడు. ఈ సినిమాలో బ్రహ్మాజీ, నరేష్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు