సమీక్ష: జాక్ – కొంతమేర ఓకే అనిపిస్తుంది

jack Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 10, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్, నరేష్, సుబ్బరాజ్ తదితరులు
దర్శకుడు : భాస్కర్
నిర్మాణం: బివిఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు
సంగీతం : అచ్చు రాజమణి
సినిమాటోగ్రఫీ : విజయ్ కె చక్రవర్తి
ఎడిటర్ : నవీన్ నూలి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో చేసిన స్పై థ్రిల్లర్ జాక్ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తన చిన్ననాటి జీవితంలో జరిగిన ఒక విషాద ఘటనతో పేబ్లా నెరుడా అలియాస్ జాక్ (సిద్దూ జొన్నలగడ్డ) భారత దేశానికి ఒక రా ఏజెంట్ గా మారాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో తన నాన్న ప్రసాద్ (నరేష్) తెలీకుండా చాలా చేస్తాడు. ఇంకోపక్క రా ఏజెన్సీలో వర్క్ చేస్తున్న పేరు మోసిన ఆఫీసర్ మనోజ్ (ప్రకాష్ రాజ్) తన టీం కలిసి ఒక టెర్రర్ అటాక్ ని ఆపే ఇన్వెస్టిగేషన్ లో జాక్ కూడా తన సెపరేట్ ఆపరేషన్ చేస్తాడు. ఇలా వేరు వేరు గా స్టార్ట్ అయ్యిన ఈ ఆపరేషన్ ఎటు దారి తీసింది. భయంకరమైన టెర్రరిస్ట్ అటావుర్ రెహమాన్ ఎవరు? అతనేం ప్లాన్ చేసాడు? ఈ క్రమంలో జాక్, మనోజ్ లు ఏం చేశారు? క్యాట్ ఇన్వెస్టిగేషన్ పేరిట అఫ్షాన్ బేగం (వైష్ణవి చైతన్య) పాత్ర ఈ సినిమాలో ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

మొదటిగా నటీనటులు నుంచే చూసుకుంటే సిద్ధూ జొన్నలగడ్డ నుంచి టిల్లు లాంటి రోల్ తర్వాత జాక్ మరో సాలిడ్ ఛాయిస్ అని చెప్పవచ్చు. జాక్ గా సిద్దూ మంచి పెర్ఫార్మన్స్ ని కనబరిచాడు. అలాగే తన రోల్ లో మంచి హ్యాండ్సమ్ గా చాలా కాన్ఫిడెన్స్ గా తన మార్క్ కామెడీ టైమింగ్ తో అలరిస్తాడు.

అలానే సాంగ్స్ లో తన డాన్స్ స్కిల్స్ కూడా బాగా చూపించాడు. ఇంకా ఎమోషనల్ సీన్స్ తనపై పండాయి. అలాగే వైష్ణవి తన రోల్ లో బాగా చేసింది. సిద్ధుకి తనకి నడుమ కొన్ని సీన్స్ మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తాయి.

ఇక వీరితో పాటుగా ప్రకాష్ రాజ్ తన రోల్ కి న్యాయం చేశారు. అలాగే నరేష్ మంచి కామెడీ సహా పలు ఎమోషన్స్ ని కూడా బాగా చేశారు. వీరు సహా మిగతా ప్రధాన నటీనటులు తమ పాత్రల్లో షైన్ అయ్యారు.

ఇక ఈ సినిమాలో కామెడీ, థ్రిల్ మూమెంట్స్ మంచి బ్యాలెన్సింగ్ గా కొనసాగడం ఆడియెన్స్ కి ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. మెయిన్ గా ఈ కథనం ఫస్టాఫ్ లో ఇంప్రెస్ చేస్తుంది. అంతే కాకుండా సాలిడ్ హై సీన్స్ కూడా సినిమాలో ఆడియెన్స్ చేత విజిల్ కొట్టిస్తాయి. ఇంకా కొన్ని కొన్ని ట్విస్ట్ లు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

మంచి ఇంట్రెస్టింగ్ గా సాగిన ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ మాత్రం కొంచెం రెగ్యులర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లానే అనిపిస్తుంది. క్లైమాక్స్ కి వచ్చే సరికి కథనం కొంచెం ఊహాజనీతంగానే అనిపిస్తుంది. దీనితో మరీ అంత ఎగ్జైటింగ్ గా అనిపించదు.

అంతేకాకుండా కొన్ని కొన్ని లాజిక్స్ కూడా సింపుల్ గానే అనిపిస్తాయి. అలాగే మరో డ్రా బ్యాక్ వైష్ణవి చైతన్య పాత్ర అని చెప్పవచ్చు. ఆమె సినిమాలో బాగానే చేసింది కానీ ఆద్యంతం ఆమె పాత్రని ఇరికించిన ఫీల్ ఒక టైం తర్వాత అనిపించవచ్చు. ఆమెకి సిద్ధూకి కొన్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేయవచ్చు కానీ కొన్ని సీరియస్ మూమెంట్స్ లో అవసరమా అనిపించక మానదు.

సాంకేతిక వర్గం:

సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. కథకి తగ్గట్టుగా కొన్ని రియల్ లొకేషన్స్ కి వెళ్లారు కానీ విజువల్ ఎఫెక్ట్స్ లో మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. వి ఆర్ వైద్ధి తన స్కోర్ తో చాలా సీన్స్ ని లేపాడు. అచ్చు పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే.

ఇక దర్శకుడు భాస్కర్ విషయానికి వస్తే.. దర్శకునిగా ఒక సినిమాతో సంబంధిం లేకుండా మరో కొత్త సబ్జెక్ట్ ని తను అందించే ప్రయత్నం బాగుంది. కొంచెం ఆలస్యం అయినా ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు తను ఎంచుకుంటున్నారు. అలానే వచ్చిన ఈ జాక్ లో తన దర్శకత్వం ఫస్టాఫ్ లో తన ప్రతిభను చూపిస్తుంది. యాక్షన్, సస్పెన్స్ సహా కామెడీ సీన్స్ ని తాను బాగా రాసుకున్నారు కానీ అక్కడక్కడా కథనం మాత్రం రెగ్యులర్ గానే నడిపారు. ఇది మినహా తన దర్శకత్వం సినిమాకి బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ‘జాక్’ లో సిద్ధూ జొన్నలగడ్డ డీసెంట్ ఎంటర్టైన్మెంట్ తన సైడ్ నుంచి అందించాడు. అలాగే పలు కామెడీ సీన్స్, స్పై సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. కానీ ఇదే మూమెంటం సెకండాఫ్ లో కూడా కొనసాగి ఉంటే ఇంకా బాగుండేది. సో తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కేవలం అక్కడక్కడా ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version