ఫోటో మూమెంట్: పద్మ విభూషణ్ చిరంజీవి తో డీజే టిల్లు


భారతదేశ రెండవ అత్యుత్తమ పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ అవార్డు ను భారతదేశ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రకటించింది. ఇది తెలుగు వారికి చాలా గౌరవ ప్రదమైనది అని చెప్పాలి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారిని పలువురు సినీ ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ మేరకు స్టార్ బాయ్, డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు.

మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి సిద్దు బెస్ట్ విషెస్ తెలిపారు. అంతేకాక చిరుతో ఒక సెల్ఫీ దిగారు. విక్టరీ సింబల్ తో చిరు మరియు సిద్దు లు సెల్ఫీ కి ఫోజులిచ్చారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి తదుపరి విశ్వంభర చిత్రం లో కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version