కొందరు నటీమణులు మలయాళ సినీ రంగంలో ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ ఓ రిపోర్ట్ సిద్ధం చేసింది. ఐతే, ప్రస్తుతం ఈ రిపోర్ట్ మలయాళ పరిశ్రమను షాక్ కి గురి చేస్తోంది. ముఖ్యంగా మలయాళ దర్శక – నిర్మాతలలో కొందరి పై పలువురు నటీమణులు లైంగిక ఆరోపణలు చేస్తూ సంచలన విషయాలను బయట పెడుతున్నారు. ఈ క్రమంలోనే మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత, మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్ధిఖీ పై నటి రేవతి సంపత్ కొన్ని షాకింగ్ ఆరోపణలు చేసింది .
ఇంతకీ, నటి రేవతి సంపత్ చెప్పిన విషయం ఏమింటంటే.. ‘నేను ప్లస్ 2 పూర్తి చేసిన తర్వాత, ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాను. నాకు బాగా గుర్తు. అప్పుడు నా వయసు 21 ఏళ్లు. నీకు సినిమా ఛాన్స్ ఇస్తా, నా అఫీస్ కి రా’ అని సిద్ధిఖీ ఫేస్ బుక్ లో ఓ మెసేజ్ పెట్టారు. నా కూతురు లాంటి దానివి అని నన్ను పిలిచారు. దాంతో ఆయన్ని సంప్రదించాను. కానీ ఆయన మాత్రం నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ప్రస్తుతం మీరు చూస్తుంది ఆయన నిజ స్వరూపం కాదు. ఆయనలోని మరో కోణాన్ని నేను చూశా. శారీరకంగా, మానసికంగా ఆయన నన్ను బాధించాడు. నా దృష్టిలో ఆయనొక క్రిమినల్’ అని రేవతి సంపత్ ఆరోపణలు చేసింది. దీంతో ‘ఏఎంఎంఏ’ జనరల్ సెక్రటరీ పదవికి సిద్ధిఖీ రాజీనామా చేశారు.