సిద్ధు జొన్నలగడ్డ “జాక్” మూవీ లేటెస్ట్ ఇన్ఫో!


టాలీవుడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ చివరిసారిగా టిల్లు స్క్వేర్ చిత్రంలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తదుపరి పలు చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో హీరోతో పాటుగా, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, నరేష్ లు కూడా పాల్గొన్నట్లు సమాచారం. సెప్టెంబర్ మూడో వారం నుండి నేపాల్ లో తదుపరి షెడ్యూల్ షురూ కానుంది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది.

Exit mobile version