టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన సిద్ధార్థ్ “చిన్నా”


టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ నటించిన తమిళ చిత్రం చిత్తాతో తమిళ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నారు. SU అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో చిన్నా పేరిట రిలీజై విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా సొంతం చేసుకుంది. కాగా, ఈ చిత్రం ఈ ఆదివారం రోజున మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రసారం కానుంది. సహస్ర శ్రీ, నిమిషా విజయన్, అంజలి నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ధిబు నినాన్ థామస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version