బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సికందర్’ (Sikandar) పై అభిమానులతో పాటు సినీ వర్గల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ రిలీజ్ అవగా, వాటికి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ టీజర్ కట్ ఆద్యంతం పవర్‌ఫుల్ యాక్షన్‌తో నింపేశారు మేకర్స్. సల్మాన్ ఖాన్ తనదైన మార్క్ యాక్షన్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో తన మార్క్ వేసేందుకు ఏఆర్ మురుగదాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా కాజల్ అగర్వాల్ మరో కీలక పాత్రలో నటిస్తుంది.
ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను మార్చి 28న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు