సమీక్ష: సికందర్ – రొటీన్ బోరింగ్ యాక్షన్ డ్రామా!

Sikandar Movie Review Salman Khan And Rashmika Mandanna

విడుదల తేదీ : మార్చి 30, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మాన్ జోషి, ప్రతీక్ బబ్బర్, సంజయ్ కపూర్, కిషోర్ తదితరులు
దర్శకుడు : ఏఆర్ మురగదాస్
నిర్మాత: సాజిద్ నడియావాలా
సంగీతం : ప్రీతమ్
సినిమాటోగ్రఫీ : సంతోష్ నారాయణ్
ఎడిటర్ : వివేక్ హర్షన్
సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

సల్మాన్ ఖాన్ నటించిన, AR మురుగదాస్ దర్శకత్వం వహించిన తాజా బాలీవుడ్ యాక్షన్ డ్రామా సికందర్, ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

కథ :

రాజ్‌కోట్ రాజవంశానికి చెందిన సంజయ్ రాజ్‌కోట్ అలియాస్ సికందర్ అలియాస్ రాజాసాబ్ (సల్మాన్ ఖాన్), రాణి సాయిశ్రీ (రష్మిక మందన్న) అన్యోన్య దంపతులు. తమ ప్రాంతంలోని ప్రజలను కంటికి రెప్పలా చూసుకొంటారు. మంత్రి ప్రధాన్ (సత్యరాజ్)‌తో వైరం కారణంగా సాయిశ్రీ మరణిస్తుంది. అయితే తన కోరిక మేరకు ముగ్గురికి ఆమె అవయవదానం చేస్తుంది. అయితే అవయవదానం పొందిన వారికి మంత్రి ప్రధాన్ నుంచి ముప్పు ఏర్పడుతుంది. అయితే ఆ ముగ్గురు జీవితాల్లో ఉన్న సమస్యలు, మంత్రి అనుచరులు దాడిని అడ్డుకొనేందుకు సికందర్ ముంబైకి వెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ?, మంత్రి ప్రధాన్‌ కొడుకు అర్జున్‌తో సికందర్‌ గొడవ ఏమిటి ?, తన కొడుకుతో గొడవ పడిన సంజయ్‌తో మంత్రి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్నాడు ?, సాయిశ్రీ ఎలా చనిపోయింది ?, మంత్రి ప్రధాన్‌కు ఎలాంటి గుణపాఠం చెప్పాడు? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

సల్మాన్ ఖాన్ నటన బాగుంది. సల్మాన్ పై వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలు అతని అభిమానులను అలరిస్తాయి. ఇక ఈ సినిమాలో కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నాయి, అలాగే కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. సల్మాన్ ఖాన్ యాక్షన్ తో పాటు అతని పాత్రలోని వేరియేషన్స్ కూడా బాగున్నాయి.

హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్నా సల్మాన్ భార్యగా చాలా బాగా నటించింది, కానీ ఆమె పాత్ర చాలా తక్కువ నిడివి ఉంది. దీనికితోడు ఆమెకు నటించడానికి చాలా తక్కువ అవకాశం ఉంది.

మరో కీలక పాత్రలో కాజల్ అగర్వాల్ ఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. క్లైమాక్స్‌లో అండ్ ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ ‘సికిందర్’లో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక సల్మాన్ ఖాన్ పాత్రతో పాటు మిగిలిన మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో క్యారెక్టర్ తాలూకు గ్రాఫ్ కూడా బాగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

అయితే, దర్శకుడు ఏఆర్ మురగదాస్ పనితనం ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరియు ఇంటర్వెల్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగడం, సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం వంటి ఎలిమెంట్స్ బాగాలేదు. మొత్తమ్మీద దర్శకుడు ఏఆర్ మురగదాస్ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు.

మొత్తానికి ఈ ఎమోషనల్ యాక్షన్ స్టోరీలో కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని సెంటిమెంట్ సీన్స్ మాత్రమే బాగున్నాయి. ఇక మిగిలిన కంటెంట్ అంతా రొటీన్ గా ఇంట్రెస్ట్ లేకుండా సాగింది. సల్మాన్ ఖాన్ పాత్రను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి.. అంతే ఎఫెక్టివ్ గా ఆ పాత్రకి కాన్ ఫ్లిక్ట్ ను బిల్డ్ చేయాల్సింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఏఆర్ మురగదాస్ కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన సికిందర్ స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు ప్రీతమ్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాత సాజిద్ నడియావాలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

సికందర్ అంటూ వచ్చిన ఈ యాక్షన్ డ్రామాలో.. కొన్ని ఎమోషన్స్ మరియు కొన్ని యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, కథాకథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అలాగే రెగ్యులర్ స్క్రీన్ ప్లేలో వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నా.. సినిమా మాత్రం మెప్పించలేకపోయింది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version