సింగర్ అద్నాన్ సమీ ఇంట విషాదం


బాలీవుడ్‌తో పాటు పలు దక్షిణాది చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన అద్నాన్ సమీకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన పాటలు పాడే స్టైల్ డిఫరెంట్‌గా ఉండటంతో అభిమానులు ఫిదా అవుతారు. అయితే, తాజాగా అద్నాన్ సమీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

అద్నాన్ తల్లి బేగమ్ నౌరీన్ సమీ ఖాన్(77) అనారోగ్య కారణాలతో మరణించారు. ఈ విషయాన్ని అద్నాన్ సమీ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. తన తల్లి ఈ లోకంలో లేదనే వార్తను తాను జీర్ణించుకోలేకపోతున్నానని.. తన కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయిందని అద్నాన్ ఈ సందర్భంగా తెలిపాడు.

అద్నాన్ తల్లి మృతిపట్లు పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు తమ సంతాపం తెలిపారు. పాకిస్థాన్‌కి చెందిన అద్నాన్ భారత పౌరసత్వం పొందిన విషయం తెలిసిందే. అద్నాన్ సమీ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ఈ సందర్భంగా కోరారు.

Exit mobile version