సభ్య సమాజం ఏమైపోతోంది ?

సభ్య సమాజం ఏమైపోతోంది ?

Published on Jul 14, 2024 6:30 PM IST

నంద్యాల జిల్లాకి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అతి దారుణంగా హత్యాచారం చేసి.. అనంతరం ఆమెను హత్య చేసి, ఆమె శవాన్ని ఎత్తి పోతల అప్రోచ్ కాలువలో పడేసిన దారుణ ఘటన గురించి తెలిసిందే. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ దారుణ ఘటనపై ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు స్పందిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద ఈ హత్యాచార ఘటనపై స్పందిస్తూ.. ‘మూడో తరగతి చదువుతున్న ఆడబిడ్డ మీద మైనర్ బాలురు చేసిన హత్యాచార ఘటన దారుణం. అసలు సభ్య సమాజం ఎటు పోతోంది.. ఏమైపోతోంది.. దయచేసి పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దు.. పిల్లలకు ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేయాలి. నాలా ఇదే మాట అందరూ అంటున్నారు. కానీ దురదృష్టవ శాత్తూ అలాంటి వారే మళ్లీ సామాజిక మాధ్యమాల్లో అడల్ట్ కామెడీ, మీమ్స్, ట్రోల్స్, డార్క్ కామెడీ అంటూ పిచ్చి పిచ్చిగా కామెంట్లు చేస్తున్నారు’ అంటూ చిన్మయి తన వీడియోలో తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు