హీరో నితిన్ గురుంచి సింగర్ మంగ్లీ ఏం చెప్పిందంటే?

Published on Sep 15, 2021 2:13 am IST


యూత్ స్టార్ నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “మాస్ట్రో”. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “అంధధూన్’కి రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటించింది. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ సినిమా సెప్టెంబ‌ర్ 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరిగింది.

ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటిసున్న సింగర్ మంగ్లీ మాట్లాడుతూ ఈ సినిమాలో నాకు ఓ మంచి పాత్ర ఇచ్చారని, ఆ పాత్ర నాకు బాగా సెట్ అయ్యే పాత్ర అని అన్నారు. హీరో నితిన్ గురుంచి కూడా మాట్లాడుతూ ఒక హీరో అనే ఫీలింగ్ లేకుండా చాలా సాధారణంగా, ఫ్రెండ్లీగా కలిసిపోతాడని, ఒక బ్రదర్ లాగా చూసుకున్నాడని, నితిన్ సపోర్ట్ మర్చిపోలేనిదని మంగ్లీ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :