వరల్డ్ వైడ్ గా నెట్ ఫ్లిక్స్ లో సార్/వాతి ట్రెండింగ్!


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం సార్/వాతి ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో కి వచ్చిన వెంటనే ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తాజా మరియు ఆశ్చర్యకరమైన వార్త ఏమిటంటే, ఈ చిత్రం యొక్క తమిళ మరియు తెలుగు వెర్షన్లు రెండూ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్‌లో ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం (మార్చి 13-19, 2023), వాతి ప్రస్తుతం ఆంగ్లేతర విభాగంలో 9వ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది, అయితే సార్ 10వ స్థానంలో స్థిరపడింది. ఈ ఫీట్ పట్ల మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సాయి కుమార్, సముద్రఖని, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version