ట్రెండింగ్ లో దూసుకెళ్తున్న ‘SIT(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)’ మూవీ

ట్రెండింగ్ లో దూసుకెళ్తున్న ‘SIT(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)’ మూవీ

Published on Jul 19, 2024 12:30 PM IST

ఇన్వెస్టిగేటివ్ మర్డర్ మిస్టరీ నేప‌థ్యంలో వ‌చ్చిన‌ SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. అరవింద్ కృష్ణ హీరోగా మల్టీ-షేడ్ పాత్రలో త‌న యాక్టింగ్ తో ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్నారు.

ఇక ప్రస్తుతం ఈ చిత్రం ఓటిటి ప్లాట్ ఫామ్ జీ5 లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఓటిటి స్ట్రీమింగ్ కి వచ్చి 10 వారాలు గ‌డిచినా కూడా ఈ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉండ‌టం విశేషం. కాగా ఆర్మాక్స్ రేటింగ్‌ల ప్రకారం, దేశవ్యాప్తంగా అత్యధికంగా ఇష్టపడిన, అత్యధికంగా వీక్షించబడిన తెలుగు చలనచిత్రాలు/వెబ్ సిరీస్ జాబితాలో SIT అగ్రస్థానంలో ఉంది.

భారీ పోటీ ఉన్నప్పటికీ, గ్రిప్పింగ్‌గా సాగే ఈ SIT మూవీ 2.8 మిలియన్ల వీక్షకులతో టాప్ ప్లేస్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. దీనిపై చిత్ర ద‌ర్శ‌క‌ నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హెడ్‌గా అరవింద్ కృష్ణ ఈ చిత్రంలో ఔట్ స్టాండింగ్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడ‌ని.. ఎంతో ఛాలెంజింగ్‌ కారెక్టర్ అయినా చక్కగా నటించి మెప్పించాడ‌ని మేక‌ర్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు