యూఎస్ లో దూసుకెళ్తున్న “సీతా రామం” వసూళ్లు.!

Published on Aug 12, 2022 1:00 pm IST


మళయాళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ టాలెంటెడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “సీతా రామం”. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం టాలీవుడ్ సహా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఒక బెస్ట్ సినిమాగా మంచి పేరు సహా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను కూడా రాబడుతుంది.

ఇక ఓవర్సీస్ మార్కెట్ లో అయితే నాన్ స్టాప్ వసూళ్లు ఈ చిత్రానికి అందుతున్నాయి. లేటెస్ట్ గా యూఎస్ వసూళ్ల విషయానికి వస్తే ఈ చిత్రం 8 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని లేటెస్ట్ గా క్రాస్ చేసి డెఫినెట్ గా 1 మిలియన్ స్టోన్ ని టచ్ చేసే దిశగా దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా, సుమంత్ అలాగే తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా స్వప్న సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :