ఓటిటి లో “సీతారామం” హిందీ వెర్షన్ కి డేట్ ఫిక్స్!

ఇటీవల విడుదలైన తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రం సీతా రామం ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. ఇప్పుడు లేటెస్ట్ మరియు అధికారిక సమాచారం ఏమిటంటే, సీతా రామం యొక్క హిందీ వెర్షన్ OTT అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వెర్షన్లు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యాయి. హిందీ వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ లో నవంబర్ 18, 2022 న ప్రసారం కానుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న కీలక పాత్ర పోషించింది. రొమాంటిక్ బ్లాక్‌బస్టర్‌లో తరుణ్ భాస్కర్, శత్రు, సుమంత్, భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకుర్చారు.

Exit mobile version