స్టార్ బాయ్ తో హ్యాట్రిక్ గా ఊహించని ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సితార మేకర్స్


టాలీవుడ్ లేటెస్ట్ షైనింగ్ హీరో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో ఆల్రెడీ వచ్చిన రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయి అనేది అందరికీ తెలుసు. ఇలాంటి కలయికలో మరో సినిమా అంటే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే అభిప్రాయానికి తెలుగు ప్రేక్షకులు వచ్చేశారు. ఇలా హ్యాట్రిక్ ప్రాజెక్ట్ గా వీరు ఒక ఊహించని సబ్జెక్టుతో రాబోతున్నారు.

ఈ విజయదశమి శుభ సందర్భంగా, భారతీయ సినిమా చరిత్రలో ఇంతవరకు ఎవరూ ఊహించని కథాంశంతో సినిమా చేస్తున్నట్లు సాహసవంతమైన ప్రకటన చేశారు నిర్మాతలు. “కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం” అనే సంచలన కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది.

వైవిధ్యమైన కథలు, పాత్రల ఎంపికతో అనతికాలంలోనే తనదైన కల్ట్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న సిద్ధూ ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రం కోసం ప్రతిభగల ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరెపుతో చేతులు కలిపారు.

మరి విభిన్నమైన మరియు ప్రత్యేకమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం 2026 జనవరిలో థియేటర్లలో అడుగుపెట్టంనుందని, ఈ చిత్రంతో మరో ఐకానిక్ థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్‌ను అందిస్తామని నిర్మాతలు వాగ్దానం చేస్తున్నారు. ఈ సినిమాని భారీస్థాయిలో, ప్రపంచస్థాయి సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version