విజయ్ కి పోటీగా శివకార్తికేయన్ దిగబోతున్నాడా?

ఇళయ దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “జన నాయగన్”. దాదాపు విజయ్ కెరీర్లో ఇదే ఆఖరి సినిమా కావడంతో అభిమానులు ఆశలన్నీ ఈ సినిమా మీదనే ఉన్నాయి. అయితే ఈ చిత్రం లేటెస్ట్ గా వచ్చే ఏడాది పొంగల్ కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇది విజయ్ కి చివరి సినిమా కావడం తన స్టార్డం కూడా అందరికీ తెలుసు కాబట్టి విజయ్ కి పోటీగా ఎవరూ రారు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఇపుడు తనకి పోటీగా యువ హీరో శివకార్తికేయన్ దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. తాను హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకురాలు సుధ కొంగర తెరకెక్కిస్తున్న “పరాశక్తి” చిత్రాన్ని కూడా మేకర్స్ వచ్చే ఏడాది పొంగల్ బరిలో దించాలని చూస్తున్నారట. దీనితో విజయ్ కి డెఫినెట్ గా గట్టి పోటీ తప్పదని చెప్పాలి. మరి ఈ క్లాష్ ఒకే రోజు ఉంటుందా లేక వేరే తేదీల్లోనా అనేది మాత్రం ఇంకా వేచి చూడాలి.

Exit mobile version