‘అమరన్’ ప్రమోషన్స్‌లో శివ కార్తికేయన్, సాయి పల్లవి..!

‘అమరన్’ ప్రమోషన్స్‌లో శివ కార్తికేయన్, సాయి పల్లవి..!

Published on Sep 21, 2024 11:31 PM IST

కోలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్ట్ చేస్తుండగా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ తాజాగా షురూ చేసింది.

ఇందులో భాగంగా తమిళ మీడియాతో చిత్ర యూనిట్ చాట్‌చాట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో శివకార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవితో పాటు ఈ చిత్ర నిర్మాత కమల్ హాసన్ కూడా హాజరయ్యారు. ఇక సాయి పల్లవి చీరకట్టులో అక్కడున్నవారిని ఆకట్టుకుంది. వారు మీడియాతో సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

అమరన్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు