తమిళ హీరో శివ కార్తికేయన్ నటించే సినిమాలు తెలుగులోనూ సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఆయన నటించిన రీసెంట్ మూవీ ‘అమరన్’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు ఆయన మరో పవర్‌ఫుల్ కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈసారి స్టార్ లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ పీరియాడిక్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ హీరో.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో జయం రవి(రవి మోహన్), అథర్వ, శ్రీలీల వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పీరియాడిక్ కథగా స్టూడెంట్ రాజకీయ నేపథ్యం తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం పవర్‌ఫుల్‌గా కట్ చేశారు మేకర్స్. ఇందులో మెయిన్ లీడ్ పాత్రలన్నీ కనిపించాయి. జయం రవి, అథర్వ, శ్రీలీల, శివకార్తికేయన్ వింటేజ్ లుక్స్‌తో కనిపించారు.
ఈ టీజర్‌కు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకు రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచడంతో ఈ సినిమా కోసం వారు ఆసక్తిగా చూస్తున్నారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి