కల్వకోట సాయితేజ – తరుణీ సింగ్ జంటగా ఎస్.ఆర్.ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై యువ ప్రతిభాశాలి శివన్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ.. యువ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డి లింగాల నిర్మిస్తున్న లవ్ థ్రిల్లర్ ‘శివన్. ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ కు ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది. యూత్ కు కావాల్సిన అంశాలతో పాటు మాస్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు శివన్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇది ఒక మంచి లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. నిర్మాత సంతోష్ రెడ్డి ఖర్చుకు ఎక్కడా వెనకడకుండా రిచ్ గా సినిమము నిర్మించారు. ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.
నటీనటులు: సాయి తేజ, సి.వి.ఎల్, టి.ఎన్. ఆర్, అర్జున్ రెడ్డి భూషణ్, మహేంద్ర, డి.ఎస్.రావు తదితరులు అలాగే సాంకేతిక నిపుణులు: ఎడిటింగ్: శివ సర్వాణి, కెమెరా: మీరన్, మ్యూజిక్: సిద్ధార్ధ్ సదాశివుని, నిర్మాత: సంతోష్ రెడ్డి లింగాల, రచన-దర్శకత్వం: శివన్.