ఆగస్టులో ఎన్ని రీ-రిలీజ్‌లు ఉన్నాయంటే..!

ఆగస్టులో ఎన్ని రీ-రిలీజ్‌లు ఉన్నాయంటే..!

Published on Aug 1, 2024 9:00 PM IST

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ నెలలో చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మంచి క్రేజ్ ఉన్న సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు వస్తున్నాయి. అయితే, వీటితో పాటు రీ-రిలీజ్ చిత్రాలు కూడా ఆడియెన్స్‌ను మెప్పించేందుకు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

ప్రస్తుతం రీ-రిలీజ్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. దీంతో స్టార్ హీరోల సినిమాలతో పాటు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సినిమాల వరకు తిరిగి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. అయితే, ఆగస్టు నెలలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా అరడజను సినిమాలు రీ-రిలీజ్ అవుతుండటం విశేషం. ఇందులో ఇండస్ట్రీ హిట్ సినిమా దగ్గర్నుంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ వరకు ఉన్నాయి.

ఆగస్టు 2న ఈ నాని, సమంత జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ రీ-రిలీజ్ అవుతోంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మురారి’ రీ-రిలీజ్ కానుంది. అయితే, ఆగస్టు 8న ‘ఒక్కడు’ చిత్రం కొన్ని ఏరియాల్లో మాత్రమే రిలీజ్ అవుతోంది.

ఆగస్టు 28న మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే కానుకగా ఇండస్ట్రీ హిట్టు బొమ్మ ‘ఇంద్ర’ గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది. ఆగస్టు 28న నాగార్జున పుట్టినరోజు కానుకగా ‘మాస్’ సినిమా రీ-రిలీజ్ అవుతోంది. ఆగస్టు 29న క్లాసిక్ కల్ట్ మూవీ ‘శివ’ రీ-రిలీజ్ కానుంది. ఇలా ఆగస్టు నెలలో ఇప్పటికైతే 6 సినిమాల రీ-రిలీజ్ డేట్స్‌ను మేకర్స్ ప్రకటించారు. మరికొన్ని సినిమాలు ఈ జాబితాలో యాడ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు