‘సైజ్ జీరో’ సెన్సార్ పూర్తి, భారీ రిలీజ్‌కు రెడీ!

‘సైజ్ జీరో’ సెన్సార్ పూర్తి, భారీ రిలీజ్‌కు రెడీ!

Published on Nov 20, 2015 1:32 PM IST

size-zero
తెలుగు, తమిళ భాషల్లో నటిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న అనుష్క, తాజాగా ‘సైజ్ జీరో’ సినిమా కోసం ఓ పెద్ద సాహసాన్నే చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఏకంగా 25 కేజీల బరువు పెరిగి నటనపై, సినిమాలపై తనకున్న మక్కువను చూపుకున్నారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాను పీవీపీ సంస్థ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన ఆడియో, ట్రైలర్స్ ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి రేకెత్తించగా అందుకు ఏమాత్రం తగ్గకుండా వినూత్నమైన ప్రచార కార్యక్రమాలతో సైజ్ జీరో టీమ్ దూసుకుపోతోంది.

ఇక తాజాగా ఈ ఉదయం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక సెన్సార్‌తో సహ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను నవంబర్ 27న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుందని పీవీపీ సంస్థ ప్రకటించింది. రెండు వర్షన్స్‌లో కలుపుకొని సుమారు 1500 థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఆర్య హీరోగా నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూర్చారు.

తాజా వార్తలు