“సరిపోదా శనివారం” కథలో కొత్తదనం ఉంది – ఎస్.జే. సూర్య

కోలీవుడ్ లో మాత్రమే కాకుండా, టాలీవుడ్ లో కూడా అభిమానులని సంపాదించుకున్న నటుడు ఎస్.జే. సూర్య. ఈ నటుడు తదుపరి సరిపోదా శనివారం చిత్రంలో కనిపించనున్నాడు. హీరో నాని ప్రధాన పాత్రలో, దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎస్.జే. సూర్య సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

“వివేక్ ఆత్రేయ గారు వచ్చి కథ చెప్పినప్పుడు నా క్యారెక్టర్ బాగా నచ్చింది. ఇలాంటి పాత్ర నేను చేయాలి అని అనిపించింది. ఆయన చెప్పిన కథలో కొత్తదనం ఉంది. ఈ సినిమాలో నాని గారికి చిన్నప్పటి నుండి కోపం ఉంటుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళ అమ్మగారు హీరోకి చెప్తారు. వారం రోజులు వచ్చే కోపాన్ని దాచుకొని కేవలం శనివారం రోజు మాత్రమే ఎక్స్ ప్రెస్ చెయ్ అని చెప్తారు. ఇది కాన్సెప్ట్” అని అన్నారు. ఈ కామెంట్స్ తో సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

Exit mobile version