బయట పవన్ కళ్యాణ్.. సినిమాలో రామ్ నందన్ – ఎస్.జె.సూర్య

బయట పవన్ కళ్యాణ్.. సినిమాలో రామ్ నందన్ – ఎస్.జె.సూర్య

Published on Jan 4, 2025 8:33 PM IST

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా చూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు నెక్స్ట్ లెవెల్ అని వారు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో గ్రాండ్‌గా నిర్వహిస్తు్న్నారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్‌లో ఎస్.జె.సూర్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని.. రామ్ చరణ్ ఇందులో రెండు పాత్రల్లో నటిస్తున్నాడని.. అందులో ఒకటి రామ్ నందన్ అని.. ఆ పాత్ర ఎలా ఉండబోతుందంటే.. బయట పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఉన్నారో.. సినిమాలో రామ్ నందన్ పాత్ర కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది.. అని ఎస్.జె.సూర్య తెలిపాడు.

దీంతో ఈ పాత్ర పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దీంతో ఆయన ఏం మాట్లాడతారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు