యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు-2’. ఐతే, నిన్న రాత్రి హైదరాబాద్ లో నిర్వహించిన భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చిన సంగతి తెలిసిందే. నటుడు ఎస్‌జే సూర్య మాట్లాడుతూ.. ‘నా ఫ్రెండ్ పవన్ కల్యాణ్ గురించి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. నేను మూడేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని చెప్పాను. ఇప్పుడు అది సగం మాత్రం ప్రూవ్ అయింది. మిగతా సగం కూడా మీరే ప్రూవ్ చేయాలి అంటూ ప్రేక్షకులను ఉద్దేశించి ఎస్జే సూర్య కామెంట్స్ చేశారు.
ఎస్‌జే సూర్య, పవన్ పేరు ప్రస్తావించగానే ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అభిమానుల అరుపులతో ఆడిటోరియం అదిరిపోయింది. దీంతో, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్‌జే సూర్య కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కాగా కమల్ హాసన్ లీడ్ రోల్‌లో రాబోతున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడీ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, రవివర్మన్ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, SJ సూర్య, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని మరియు బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.350కోట్ల బడ్జెట్‌తో దీన్ని రూపొందించారు.