ఫుల్ స్వింగ్ లో ‘స్కంద’ హిందీ ప్రమోషన్స్

ఫుల్ స్వింగ్ లో ‘స్కంద’ హిందీ ప్రమోషన్స్

Published on Sep 23, 2023 7:00 PM IST

రామ్ పోతినేని, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ స్కంద. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియన్ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించగా ఎస్ థమన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 28న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది స్కంద. మరోవైపు ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై అంచనాలు మరింతగా పెంచేసాయి.

ఇక తమ సినిమా యొక్క రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో తెలుగు తో పాటు అటు హిందీలో కూడా ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది స్కంద టీమ్. అందులో భాగంగా నేడు ఫేమస్ హిందీ డబ్బింగ్ ఆర్టిస్ట్ సంకేత్ మాత్రే నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో పాల్గొన్న హీరో రామ్, స్కంద గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన సినిమాలు తెలుగు రిలీజ్ అనంతరం యూట్యూబ్ లో హిందీ డబ్ వర్షన్ రిలీజ్ అయి మిలియన్స్ లో వ్యూస్ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. అలానే తప్పకుండా స్కంద నార్త్ తో పాటు అన్ని భాషల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు